KiranPrabha  Telugu Talk Shows podcast

Varsham | Rachakonda Viswanatha Sastry | వర్షం । రావిశాస్త్రి రచన। కథా పరిచయం

0:00
23:37
Spola tillbaka 15 sekunder
Spola framåt 15 sekunder

రావిశాస్త్రి గారు రాసిన 'వర్షం' కథ, అడవిపాలెం సమీపంలోని ఒక మట్టి రోడ్డు జంక్షన్‌లో ఉన్న టీ కొట్టులో, భారీ వర్షం కురుస్తున్న ఒక సాయంత్రం వేళ జరుగుతుంది. పెళ్లి చూపుల కోసం ఆ ఊరికి వచ్చిన పురుషోత్తం అనే యువకుడు, మరో రెండు గంటల్లో కలకత్తా వెళ్లే రైలును అందుకోవాలనే ఆత్రుతలో ఉండి, నిలిచిపోని వాన వల్ల ఆ పూరిపాకలో చిక్కుకుపోతాడు. బయట పిడుగులు, ఉరుములతో ప్రకృతి జబర్దస్త్ చేస్తుంటే, అక్కడి నుంచి వెళ్లలేక దిగాలు పడిన పురుషోత్తం తన బలహీనమైన వ్యక్తిత్వం గురించి, ఎదుటివారు చెప్పినట్లు వినే తన స్వభావం గురించి మధనపడుతుంటాడు.. అప్పుడు, అక్కడ అతడికి ఎదురైన అనుభవాలేమిటి? అతడు నేర్చుకున్న పాఠాలేమిటి? Link to Read Full Story: https://kathanilayam.com/story/pdf/19434

Fler avsnitt från "KiranPrabha Telugu Talk Shows"